HomeENTERTAINMENTIdupu Kayitham: ఆకట్టుకుంటోన్న 'ఇడుపు కాయితం' టీజర్..

Idupu Kayitham: ఆకట్టుకుంటోన్న ‘ఇడుపు కాయితం’ టీజర్..

📰 Generate e-Paper Clip

టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోభాగంగా టీజర్‌ను విడుదల చేశారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఒక చక్కని కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. రామాయణ విశిష్టతను వివరిస్తూ ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంతో ఈ టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత హీరోహీరోయిన్ల పరిచయం, పెద్దలు కుదిర్చిన వివాహంతో వారిద్దరూ ఒక్కటవ్వడం, వారి వైవాహిక జీవితంలోని మధుర క్షణాలను ఎంతో అందంగా చూపించారు.

కొత్తగా పెళ్లయిన ఆ జంట విడాకుల వరకు వెళ్లడం ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య తలెత్తే భేదాలు , కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆహ్లాదకరమైన సన్నివేశాలతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular