HomeANDRA PRADESHAP Panchayat Elections:సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..మూడు విడతల్లో పోలింగ్!

AP Panchayat Elections:సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..మూడు విడతల్లో పోలింగ్!

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 13,219 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 13న అధికారిక షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది.

ఇందులో భాగంగా నవంబర్ 13న మొదటి విడతకు, నవంబర్ 16న రెండో విడతకు, నవంబర్ 19న మూడో విడతకు నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల పోలింగ్ తేదీల విషయానికి వస్తే.. మొదటి విడత ఎన్నికలు నవంబర్ 26న నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్ నవంబర్ 29న, మూడో విడత పోలింగ్ డిసెంబర్ 2న జరగనుంది. దీంతో డిసెంబర్ 2వ తేదీతో మూడు విడతల పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది.

మరోవైపు ఆశావహులు గ్రామాల్లో ప్రజలను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల కోలాహలం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సర్కార్ హవా కొనసాగగా సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular