AP Panchayat Elections:సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..మూడు విడతల్లో పోలింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 13,219 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 13న అధికారిక షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది....