HomeENTERTAINMENTMaatrubhumi:సల్మాన్ ఖాన్ 'మాతృభూమి'కి మళ్లీ బ్రేక్!

Maatrubhumi:సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి మళ్లీ బ్రేక్!

📰 Generate e-Paper Clip

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. ఈ సినిమా రిలీజ్ విషయంలో మళ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తొలుత ఏప్రిల్ 17న విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తొలుత ఈ సినిమాను నవంబర్ 13న విడుదల చేయాలని నిర్ణయించగా సెన్సార్ ప్రక్రియలో ఎదురైన జాప్యం కారణంగా ఆ తేదీకి విడుదల సాధ్యం కాలేదు. దీంతో నవంబర్ 20ని కొత్త విడుదల తేదీగా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రణాళిక కూడా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిసెంబర్ 11న విడుదల చేసే అవకాశాలపై చిత్ర నిర్మాణ సంస్థ దృష్టి సారించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ భారత సైనిక అధికారి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ సమయంలో 16 బీహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించిన సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయనకు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది.

అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్, ముకేష్ రిషి, అంకుర్ భాటియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular