HomeENTERTAINMENTSai Pallavi:రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలోసాయిపల్లవి!

Sai Pallavi:రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలోసాయిపల్లవి!

📰 Generate e-Paper Clip

తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. రణ్‌బీర్‌తో ‘రామాయణం’ సినిమాలో సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి..తాజాగా మ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా సాయి పల్లవి తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ఓం. ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం.

ఈ సినిమాలో సాయి పల్లవి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాపై పోరాటం చేసే ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.

ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular