HomeHOMEDiwali:గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌..కానీ!

Diwali:గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌..కానీ!

📰 Generate e-Paper Clip

దీపావళి వేడుకల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. అయితే అది కేవలం రెండు రోజులు మాత్రమే. నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే బాణసంచా కాల్చుకోవచ్చని స్పష్టం చేసింది. నవంబర్ 9 నుంచి గ్రీన్ క్రాకర్స్‌పై పూర్తి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

సోమవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు అలాగే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యాన్ని అరికట్టేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం ఒక్కటే పరిష్కారం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గతంలో సంపూర్ణ నిషేధం విధించినప్పటికీ బాణసంచా విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోలేకపోయారని పేర్కొంది. అందువల్ల పరిమిత సమయాల్లో గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, నిశ్శబ్ద ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల పరిసరాల్లోనూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. గ్రీన్ క్రాకర్స్‌ను ప్రభుత్వం గుర్తించిన నిర్దేశిత దుకాణాల్లో మాత్రమే విక్రయించాలని కోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్‌లో బాణసంచా విక్రయాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

Also Read:BJP:భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు..

విక్రయ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనుమతించిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయిస్తున్నారా?,  వాటిపై సంబంధిత క్యూఆర్ కోడ్‌లు ఉన్నాయా? అనే అంశాలను బృందాలు తనిఖీ చేయాలని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించి నిషేధిత బాణసంచా తయారు చేసినా, విక్రయించినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular