Diwali:గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌..కానీ!

దీపావళి వేడుకల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. అయితే అది కేవలం రెండు రోజులు మాత్రమే. నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే బాణసంచా కాల్చుకోవచ్చని స్పష్టం చేసింది. నవంబర్ 9 నుంచి గ్రీన్ క్రాకర్స్‌పై పూర్తి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. సోమవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 7, 8 తేదీల్లో...