HomeHOMEBJP:భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు..

BJP:భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు..

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ చేపట్టిన ‘లోక్‌తంత్ర బచావో – అరాజకతా హటావో’ మహాపాదయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం అమిత్ షా బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ వరకు నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొననున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా బీజేపీ ఈ పాదయాత్రను నిర్వహిస్తోంది.

Also Read:Raja Prabhakar: రోడ్డు విస్తరణ బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలి

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం ఇండియా కూటమి నేతలు నిర్వహించిన సభకు ప్రతిగా బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటు చోరీ ఆరోపణలతో బీజేపీని అధికారంలో నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఓటు చోరీ ఆరోపణలపైనా ఆయన స్పందించవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమిత్ షా పాదయాత్ర నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయగా ‘షా’ పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular