HomeLIFE STYLELifestyle News: మారుతున్న కాలం.. రొమాన్స్ కోసం ట్రైనింగ్..ఏటువైపు వెళ్తున్నామో?

Lifestyle News: మారుతున్న కాలం.. రొమాన్స్ కోసం ట్రైనింగ్..ఏటువైపు వెళ్తున్నామో?

📰 Generate e-Paper Clip

ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని సంప్రదాయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని అసలు ఇలా కూడా ఉంటాయా? అని ఆలోచించేలా చేస్తాయి. అలాంటి ప్రత్యేకమైన సంప్రదాయానికి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కుక్ దీవుల సమూహంలో ఉన్న మంగాయా ద్వీపం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గతంలో యువతకు ప్రేమ, సంబంధాలు, వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించే ఆచారం ఉండేదని మానవ శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మంగాయా ద్వీపంలో ఒకప్పుడు యుక్తవయసుకు చేరుకున్న అబ్బాయిలకు పెద్దవారి ద్వారా ప్రత్యేక బోధన ఇచ్చేవారని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమ సంబంధాలు, భాగస్వామితో ఎలా మెలగాలి, వివాహ బంధంలో ఉండాల్సిన బాధ్యతలు వంటి అంశాలపై అవగాహన కల్పించేవారని చెబుతారు. అమెరికన్ మానవ శాస్త్రవేత్త డొనాల్డ్ మార్షల్ 1950వ దశకంలో ఈ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించి అక్కడి సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని నమోదు చేశారు.

అధ్యయనాల ప్రకారం.. యువకులకు తొలుత కొంతకాలం పెద్దవారి నుంచి మార్గదర్శనం అందించేవారు. అనంతరం అనుభవం కలిగిన మహిళ ద్వారా మరింత అవగాహన కల్పించే సంప్రదాయం కూడా అప్పట్లో ఉండేదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వెనుక ప్రధాన ఉద్దేశం యువతను భవిష్యత్తులో వివాహ జీవితానికి సిద్ధం చేయడమేనని వివరించారు.

మంగాయా సంస్కృతిలో ప్రేమ, పరస్పర ఆకర్షణ, భాగస్వాముల మధ్య అనుబంధానికి ప్రత్యేక స్థానం ఉండేదని పరిశోధకుల పరిశీలనలు చెబుతున్నాయి. యువత ఒకరినొకరు అర్థం చేసుకోవడం, తమ భావాలను వ్యక్తపరచడం, పరస్పర అంగీకారంతో సంబంధాలను కొనసాగించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తోంది.

అయితే ఈ సంప్రదాయంపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొందరు దీనిని పూర్వీకుల నుంచి వచ్చిన సాంస్కృతిక ఆచారంగా చూస్తే.. మరికొందరు యువత వ్యక్తిగత స్వేచ్ఛ, అంగీకారం, హక్కుల కోణంలో ప్రశ్నిస్తున్నారు. మంగాయా ద్వీపంలోని ఈ సంప్రదాయం గురించి ప్రధానంగా గతంలో నిర్వహించిన మానవ శాస్త్ర పరిశోధనల్లో ప్రస్తావనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కూడా ఇదే విధానం కొనసాగుతోందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కాలానుగుణంగా అక్కడి జీవన విధానాలు, ఆచారాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

మొత్తానికి ప్రేమ, పెళ్లి, దాంపత్య జీవితం విషయంలో ప్రపంచంలోని వివిధ సంస్కృతులు అనుసరించిన పద్ధతులు ఎంత భిన్నంగా ఉంటాయో మంగాయా ద్వీపం సంప్రదాయం తెలియజేస్తోంది.

RELATED ARTICLES

Most Popular