Lifestyle News: మారుతున్న కాలం.. రొమాన్స్ కోసం ట్రైనింగ్..ఏటువైపు వెళ్తున్నామో?

ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని సంప్రదాయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని అసలు ఇలా కూడా ఉంటాయా? అని ఆలోచించేలా చేస్తాయి. అలాంటి ప్రత్యేకమైన సంప్రదాయానికి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కుక్ దీవుల సమూహంలో ఉన్న మంగాయా ద్వీపం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గతంలో యువతకు ప్రేమ, సంబంధాలు, వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించే ఆచారం ఉండేదని మానవ శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మంగాయా ద్వీపంలో ఒకప్పుడు యుక్తవయసుకు చేరుకున్న అబ్బాయిలకు పెద్దవారి ద్వారా...