HomeTELANGANAKTR: రాహుల్‌కి బాడీ గార్డ్‌గా రేవంత్..కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం!

KTR: రాహుల్‌కి బాడీ గార్డ్‌గా రేవంత్..కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం!

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఈ శతాబ్దంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో అతిపెద్ద మోసమని ఘాటు విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రైజింగ్ కాదని, తెలంగాణ ఫాలింగ్ అవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాడీగార్డ్‌గా మారారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యల కంటే కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పు పొందడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయాల్లో చీప్‌గా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పాత్రపై కూడా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, నిజంగా ఆమె గుండెల్లో తెలంగాణ ఉంటే సంబంధిత పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు.

సోనియా గాంధీ ఆత్మలో తెలంగాణ లేదని, గుండెల్లోనూ తెలంగాణ లేదని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన పోరాటానికి కాంగ్రెస్ ఇచ్చే ప్రాధాన్యతపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES

Most Popular