KTR: రాహుల్‌కి బాడీ గార్డ్‌గా రేవంత్..కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఈ శతాబ్దంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో అతిపెద్ద మోసమని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రైజింగ్...