HomeTECHNOLOGYMicrosoft: చాట్‌జీపీటీకి మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!

Microsoft: చాట్‌జీపీటీకి మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!

📰 Generate e-Paper Clip

Microsoft: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మైక్రోసాఫ్ట్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ మోడళ్లపై ఆధారపడటాన్ని తగ్గించి.. సొంతంగా అభివృద్ధి చేసిన ఏఐ మోడళ్లను వినియోగించేందుకు ప్రయత్నిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ తన MAI మోడళ్లను ఇప్పటికే కొన్ని సేవల్లో అంతర్గతంగా అందుబాటులోకి తెచ్చింది. ఎక్సెల్, ఔట్‌లుక్ వంటి అప్లికేషన్లలో ప్రతి వారం వేలాది ఏఐ అభ్యర్థనలను ఈ మోడళ్లు నిర్వహిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఖర్చులు, సాంకేతిక నియంత్రణగా తెలుస్తోంది. అత్యాధునిక ఏఐ మోడళ్లను నిర్వహించడానికి భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్లలో ఏఐ ఫీచర్ల వినియోగం పెరిగే కొద్దీ నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బయటి సంస్థల ఏఐ మోడళ్లను వినియోగించిన ప్రతిసారీ టోకెన్ల ఆధారంగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఈ సేవలను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఖర్చులు మరింత పెరుగుతున్నాయి.

మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్‌ ముస్తఫా సులేమాన్ కూడా ఇతర సంస్థల ఏఐ మోడళ్ల కోసం చెల్లింపులు చేయడం కంపెనీ లాభాలపై ప్రభావం చూపుతుందని గతంలో పేర్కొన్నారు. దీంతో సొంత ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడంపై సంస్థ దృష్టి సారించింది. కేవలం ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా.. సాంకేతికతపై పూర్తి నియంత్రణ సాధించడం, తమ అవసరాలకు అనుగుణంగా ఏఐ మోడళ్లను రూపొందించుకోవడం కూడా ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular