HomeCRIMEVolga Videos: వోల్గా వీడియో వ్యవస్థాపకుడికి సైబర్‌ షాక్‌.. క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా లక్షల...

Volga Videos: వోల్గా వీడియో వ్యవస్థాపకుడికి సైబర్‌ షాక్‌.. క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా లక్షల రూపాయలు స్వాహా!

📰 Generate e-Paper Clip

Volga Videos: హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడు గుడూరు ప్రసాద్ క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.34.44 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గుడూరు ప్రసాద్ తన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి గత ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో విడతలవారీగా భారీ మొత్తంలో నగదు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అమెజాన్ ముంబై, అమెజాన్ బీడీ పేర్లతో ఈ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. మొత్తం రూ.34.44 లక్షలు తనకు తెలియకుండానే కార్డు నుంచి డెబిట్ అయినట్లు తెలిపారు.

అయితే ఈ లావాదేవీలకు సంబంధించి తనకు ఎలాంటి ఓటీపీలు రాలేదని…మొబైల్‌కు ఎటువంటి నోటిఫికేషన్లు కూడా అందలేదని బాధితుడు పేర్కొన్నారు. ఇటీవల తన ఫోన్‌ను పరిశీలించగా అందులో అనుమానాస్పద యాప్ ఉన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.

ఈ యాప్ ద్వారానే సైబర్ నేరగాళ్లు తన క్రెడిట్ కార్డు వివరాలను సేకరించి మోసానికి పాల్పడి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. క్రెడిట్ కార్డు వివరాలు ఎలా దుర్వినియోగమయ్యాయి? అనుమానాస్పద యాప్ ద్వారా డేటా చోరీ జరిగిందా? అనే కోణాల్లో విచారణ జరగాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular