Volga Videos: వోల్గా వీడియో వ్యవస్థాపకుడికి సైబర్ షాక్.. క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా లక్షల రూపాయలు స్వాహా!
Volga Videos: హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడు గుడూరు ప్రసాద్ క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.34.44 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుడూరు ప్రసాద్ తన అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి గత ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో విడతలవారీగా భారీ మొత్తంలో నగదు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అమెజాన్ ముంబై, అమెజాన్ బీడీ పేర్లతో ఈ...