Priya Bhavani Shankar:త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఇరుముడి బ్యూటీ!

తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ హీరోయిన్‌, ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో ఘన విజయం అందుకున్న ప్రియా భవానీ శంకర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌తో ఆమె ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ప్రియా భవానీ శంకర్ ఇటీవల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఆసక్తికరమైన ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఫోటోలను పంచుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, మెడలో మల్లెపూల దండలు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్న...