HomeENTERTAINMENTRanabaali: ఓటీటీలోకి విజయ్ - రష్మిక ‘రణబాలి’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ranabaali: ఓటీటీలోకి విజయ్ – రష్మిక ‘రణబాలి’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

📰 Generate e-Paper Clip

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో నాలుగు వారాల ప్రదర్శన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.

‘రణబాలి’ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. సింగనమల బొబ్బిలి రణబాలి వస్తున్నాడు అంటూ ఆసక్తికర క్యాప్షన్ జత చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘సౌత్‌వర్స్’ అని సెర్చ్ చేయడం ద్వారా ఇతర దక్షిణాది సినిమాలు, వెబ్‌షోలను కూడా వీక్షించవచ్చని తెలిపింది.

1876-1878 మధ్యకాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సంభవించిన మహా కరువు నేపథ్యంలో ‘రణబాలి’ కథ సాగుతుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఓ గుర్రపు స్వారీ యోధుడు చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతను సాగించే తిరుగుబాటు, ప్రజలను ఏకం చేసే విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు.మొత్తానికి ఓటీటీలో ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular