Ranabaali: ఓటీటీలోకి విజయ్ – రష్మిక ‘రణబాలి’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో నాలుగు వారాల ప్రదర్శన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ‘రణబాలి’ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని...