HomeSPORTSMaxwell:క్రికెట్‌కు విధ్వంసక ఆల్‌రౌండర్ గుడ్‌బై

Maxwell:క్రికెట్‌కు విధ్వంసక ఆల్‌రౌండర్ గుడ్‌బై

📰 Generate e-Paper Clip

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే,టెస్టు,టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న మ్యాక్స్‌వెల్ .. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

ఆగస్టు 2012లో అఫ్గానిస్థాన్‌పై జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున 149 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన మ్యాక్స్‌వెల్ అత్యధిక స్కోరు 201. వన్డేల్లో మొత్తం 3,990 పరుగులు చేయడంతో పాటు 77 వికెట్లు పడగొట్టాడు.

సెప్టెంబర్ 2012లో పాకిస్థాన్‌పై ఆయన టి20 అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరఫున 130 మ్యాచ్‌లు ఆడి 2,897 పరుగులు చేయడంతో పాటు 51 వికెట్లు తీశాడు.  అత్యధిక స్కోరు 145 పరుగులు కాగా అత్యుత్తమ బౌలింగ్ 3/10.

2013లో భారత్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాక్స్‌వెల్..ఆస్ట్రేలియా తరఫున ఏడు టెస్టు మ్యాచ్‌లు  ఆడాడు. టెస్టుల్లో భారత్‌పై చేసిన 104 పరుగులు అతని అత్యధిక స్కోరు కాగా 4/127 బౌలింగ్ బెస్ట్.

కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మ్యాక్స్ వెల్ జట్టుకు దూరంగా ఈ నేపథ్యంలోనే మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular