‘గెలిపించే బాధ్యత మీది- అభివృద్ధి చేయించే బాధ్యత నాది’

వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..

మున్సిపాలిటీలో కలిపిన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం…

ఎల్లమ్మ గుడి నిర్మాణానికి సొంత నిధులుతో నిర్మాణం చేపిస్తా: మంత్రి పొంగులేటి

వర్ధన్నపేట పట్టణ అభివృద్ధికి అదనంగా రూ.10 కోట్లు: ఎమ్మెల్యే నాగరాజు

12 వార్డుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

: మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే నాగరాజు

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు సంబంధించి 4,5,6 డీసీ తండా దుర్గమ్మ, 1,2,3,9,10 సంబంధించి అంబేద్కర్ సెంటర్ నందు, 7,8,11,12 సంబంధించి ఫిరంగిగడ్డలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శనివారం రోడ్డు షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ & సమాచార, గృహ నిర్మాణాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

‘గెలిపించే బాధ్యత మీది- అభివృద్ధి చేయించే బాధ్యత నాది’

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రిగా వర్ధన్నపేట పట్టణ అభివృద్ధి కోసం అదనంగా రూ.10 కోట్లు మంజూరు చేయించే బాధ్యత నేనే తీసుకుంటానని తెలిపారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో కలిపిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. నా సొంత డబ్బులతో ఎల్లమ్మ గుడి నిర్మాణం చేయిస్తానని మాట ఇచ్చారు.

‘గెలిపించే బాధ్యత మీది- అభివృద్ధి చేయించే బాధ్యత నాది’

ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు డ్రైన్లు వేసుకున్నాం.. మౌలిక సదుపాయాలు కల్పించుకున్నామని తెలియజేశారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని పురపోరులో గెలిపించి స్థానిక సమస్యలను పరిష్కారించుకుందామని తెలిపారు.

‘గెలిపించే బాధ్యత మీది- అభివృద్ధి చేయించే బాధ్యత నాది’

అరులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది. రెండవ విడత ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో ఇంకా మూడు విడతలు అర్హులైన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. ప్రజలందరూ ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలిచి హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలిపారు.

చివరగా ప్రజలందరికీ చెప్పేదే ఒకటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాని.. వాళ్లు ప్రతిపక్ష నాయకులు ఇది ఇస్తా.. అది ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్తారు, అలాంటి ప్రలోభాలకు లొంగకుండా అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా ప్రజలను కోరారు.

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యమని తెలియజేస్తూ నియోజకవర్గంలోని ఐనవోలు, పర్వతగిరి, హసన్‌పర్తి కేంద్రాలలో గెస్ట్ హౌస్‌లు లేవని, అలాంటి భవనాలు నిర్మించుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదని తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇళ్లు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లను తీసుకువచ్చానని, సొంత భవనాలు నిర్మించుకోవడం లేదా భూములు కబ్జా చేయడం తన అలవాటు కాదని స్పష్టం చేశారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం మొత్తం రూ.294 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోనే రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, సబ్ జైల్, మునిఫ్ కోర్టు, మినీ స్టేడియం వంటి కీలక నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాక ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, న్యాయ సదుపాయాలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు.
అదేవిధంగా, మరో రూ.35 కోట్ల నిధులతో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు వంటి పలు మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తండాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల మధ్య ఎలాంటి తేడా లేకుండా సమానంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దే విధంగా 100% కృషి చేయాలని మంత్రిని కోరారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి మూడు నుంచి నాలుగు నెలల్లో గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తండాల్లోని యువత కోసం మినీ స్టేడియం నిర్మాణాన్ని తలపెట్టామని, యువతకు క్రీడా అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని ఎమ్మెల్యే నాగరాజు ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి & కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, మాజీ టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్‌తో పాటు 12 వార్డుల అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

Last Updated on February 7, 2026 · 8:25 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles