స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జిల్లా గోదాములను కలెక్టర్ సత్య శారద శనివారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Rice test: మీరు తినే బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలిపినట్లు డౌట్ వచ్చిందా?
Last Updated on February 7, 2026 · 8:34 PM by Star Trinethram



