ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదల సొంతింటి కల
నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
పాల్గొన్న మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
పాల్గొన్న వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి
స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకి చెందిన బిక్కినేని అఖిల -వెంకట్రావుల నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో శనివారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను శాలువాతో సన్మానించి, కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని,పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి- రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపరావు, నునావత్ కమిలి – కీమా నాయక్, తిరుపెళ్లి వాణి – కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు కట్కూరి స్వామి, సమ్మెట సుధీర్, అన్వర్, కొండేటి సాంబయ్య, మహిళ నాయకురాలు రజిత రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Nalgonda: వెలిమినేడులో SFI, DYFI ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ
Last Updated on March 7, 2026 · 7:14 PM by Star Trinethram




