స్టార్ త్రినేత్రం, నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడోత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. సంక్రాంతి క్రీడల సందర్భంగా గెలుపొందిన వారికి శుక్రవారం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం 8వ వార్డు మెంబర్ నాతి కిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా నేత జిట్ట నగేష్ , డీవైఎఫ్ఐ రాష్ట్ర, జిల్లా కార్యదర్శి కోట రమేష్, మల్లం మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి వారి నాటకోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయిని, క్రీడల పట్ల అందరూ అంకితభావంతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ క్రీడలు యువతకు మంచిగా ఉపయోగపడుతాయన్నారు. వార్డు సభ్యులు నాతి కిరణ్ మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనటం మానసికంగా, శారీరకంగా ఉల్లాసానికి తోడ్పడుతుందన్నారు. క్రీడల్లో యువత మెరుగు పడేందుకు తన వంతు సాయం చేస్తానన్నారు. వెలిమినేడులో నిర్వహించిన క్రీడలు రాష్ట్ర వ్యాప్తంగా స్పూర్తి దాయకంగా నిలవాలని జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ సీపీఎం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ముఖ్య నాయకులు, శాఖ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ: Education: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
Last Updated on March 7, 2026 · 7:05 PM by Star Trinethram



