Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Horror Movie: చూస్తే పోసుకోవాల్సిందే..

Author
Posted By STAR TRINETHRAM
| 09 May 2026, 06:27 AM | Entertainment
Horror Movie: చూస్తే పోసుకోవాల్సిందే..

Horror Movie: ఈ సమ్మర్‌లో భారీ సినిమాల సందడి పెద్దగా కనిపించకపోయినా చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ శుక్రవారం పలు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గోదారి గట్టుమీద, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీలీలావతి, రవిబాబు నటించిన రేజర్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వీటితో పాటు హరుడు, విధి గీసిన విచిత్రం, ఏ ఫిల్మ్ బై గిరి వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు పాత హిట్ సినిమాల రీ రిలీజ్‌ల హవా కూడా కొనసాగుతోంది. మాస్ మహారాజ రవితేజ నటించిన కృష్ణ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుండగా, నాని నటించిన నిన్నుకోరి, శింబు నటించిన వల్లభ సినిమాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదిలా ఉండగా థియేటర్లలో కొత్త సినిమాలు అలరిస్తున్న సమయంలో ఓ భయానక చిత్రం మాత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను వణికిస్తోంది. ఒకసారి ఈ సినిమా చూడటం మొదలుపెడితే మధ్యలో ఆపడం కష్టమనేలా ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సన్నివేశం తర్వాత సన్నివేశం వెన్నులో వణుకు పుట్టించే ఈ భయానక చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలైంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి స్పందనను అందుకుని ఇప్పుడు డిజిటల్ వేదికపై మరోసారి ప్రేక్షకులను భయపెడుతోంది.

క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ ఆసక్తికరంగా సాగుతుంది. క్షుద్ర పూజలు నిర్వహించే సమయంలో అనుకోకుండా ఒక దుష్టశక్తి బయటకు రావడం, ఆ శక్తి ఒక చిన్నారి జీవితాన్ని శాపంగా మార్చడం కథలో కీలక మలుపుగా నిలుస్తుంది. ఆ దుష్టశక్తి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక తల్లి చేసే పోరాటం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. భయం, ఉత్కంఠ, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

సతన్ అంటే సైతాన్ అనే అర్థం వచ్చే ఈ చిత్రాన్ని మణికందన్ రామలింగం తెరకెక్కించారు. రెండు వేర్వేరు కాలరేఖల మధ్య కథను నడిపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. సినిమాలో ఎఫ్.జె, అయిరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భయానక సన్నివేశాల్లో నటీనటుల అభినయం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

ఈ భయానక చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమేజాన్ ప్రైమ్ వీడియోలో మే 8 నుంచి ప్రసారం అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ భయానక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం మంచి ఎంపికగా మారింది. ఉత్కంఠభరిత కథనం, భయపెట్టే సన్నివేశాలు, క్షుద్ర పూజల నేపథ్యం కలిసి ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

ALSO READ: Coriander: 10 రోజులైనా ఫ్రెస్‌గా ఘుమఘుమలాడుతూ ఉండాలంటే..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: