Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Telangana: తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్

Author
Posted By STAR TRINETHRAM
| 26 Apr 2026, 03:51 PM | Telangana
Telangana: తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్

Telangana: తెలంగాణ మహిళల ఆర్థిక సాధికారతకు ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఉచితంగా అందించనుండగా, తర్వాత విడతల వారీగా అర్హులైన మహిళలందరికీ ఈ ప్రయోజనం విస్తరించనున్నారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, అర్హుల ఎంపిక అనంతరం లబ్ధిదారులకు మిషన్ల పంపిణీ చేపట్టనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ప్రత్యేకంగా బీసీ మహిళలకు ఈ పథకం మరింత ప్రయోజనకరంగా మారనుంది. నైపుణ్యం కలిగిన మహిళలను గుర్తించి టైలరింగ్ రంగంలో వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆటోమేటిక్ కుట్టు యంత్రాలతో పాటు డిజైనింగ్, ఆధునిక టైలరింగ్ పద్ధతులు, ఇతర అనుబంధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలుకానున్న ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా జరగనుంది. కేవలం మిషన్ల పంపిణీతో పరిమితం కాకుండా, మహిళలు ఆదాయ మార్గాలను సృష్టించుకునేలా అవసరమైన ఇతర వనరులను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది.

ఇవి కూడా చదవండి

ఈ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఇది ఉపాధి ఆధారంగా మారనుంది. ఇంటి వద్ద నుంచే ఉపాధి పొందే అవకాశంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లోనూ మార్పు తీసుకురానుంది. మహిళలతో పాటు నిరుద్యోగ యువతకు కూడా నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది. వివిధ వృత్తుల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయనున్నారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ALSO READ: Tollywood Heroine: పెళ్లి కాకుండా పిల్లల్ని కనొచ్చు..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: