Telangana: తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్

Telangana: తెలంగాణ మహిళల ఆర్థిక సాధికారతకు ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఉచితంగా అందించనుండగా, తర్వాత విడతల వారీగా అర్హులైన మహిళలందరికీ ఈ ప్రయోజనం విస్తరించనున్నారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, అర్హుల ఎంపిక అనంతరం లబ్ధిదారులకు మిషన్ల పంపిణీ చేపట్టనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి...