Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Aruri Ramesh: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Author
Posted By STAR TRINETHRAM
| 07 May 2026, 03:34 PM | Telangana
Aruri Ramesh: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Aruri Ramesh: భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సభకు విస్తృత ప్రచారం కల్పించిన మీడియా ప్రతినిధులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై కేటీఆర్ చేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు అసహనంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.

2022 మే 6న కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేసిన అరూరి రమేష్, రెండున్నరేళ్లు గడిచినా అందులో పేర్కొన్న హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రైతుల కోసం ఇచ్చిన హామీల అమలుపై కేటీఆర్ ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొంటూ, రైతు బంధు, రైతు సంక్షేమ పథకాల ద్వారా రైతు కుటుంబాలకు భరోసా కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయంపై దృష్టి పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.

రైతు సమస్యలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని అరూరి రమేష్ వ్యాఖ్యానించారు. రైతుల పంట కొనుగోళ్లలో తీవ్ర సమస్యలు ఉన్నాయని, కల్లాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అవసరమైతే కలిసి కల్లాల వద్దకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని పేర్కొన్న అరూరి రమేష్, రైతు బంధు పథకాన్ని రైతులు అడగకముందే అమలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెద్ద సభలు పెట్టి హామీలు ఇస్తోందే తప్ప పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. రైతుల పక్షాన మాట్లాడిన కేటీఆర్‌పై కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేసిన పోరాటాలను ప్రజలు మర్చిపోలేరని అరూరి రమేష్ అన్నారు. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన నాయకత్వాన్ని అవమానించేలా మాట్లాడటం తగదని హెచ్చరించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మామునూరు అభివృద్ధి, నయీంనగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం, కాళోజీ కళాక్షేత్రం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సాధించారని గుర్తు చేశారు. అలాంటి అభివృద్ధిని గుర్తించకుండా విమర్శలు చేయడం రాజకీయ దౌర్భాగ్యమని అన్నారు.

రేవంత్ రెడ్డి పాలనపై కూడా అరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల తరపున అన్ని వర్గాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు పదేపదే వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ మల్కా రమేష్, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, చింతల యాదగిరి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఏకాంతం గౌడ్, సంపత్ రెడ్డి, తాళ్లపెల్లి జనార్ధన్ గౌడ్, పులి రజినీకాంత్, రామ్మూర్తి, నార్లగిరి రమేష్, నయీముద్దీన్, పానుగంటి శ్రీధర్, బండి రజినీకుమార్, రవీందర్ రావు, గండ్రకోట రాకేష్ యాదవ్, శ్రీకాంత్ చారి, మూటిక రాజు, కోటేశ్వర్ రావు, పులి విక్రమ్, వీపీ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, స్నేహిత్, పున్నం చందర్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Muhammad Ayub: ‘రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు’

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి