Aruri Ramesh: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Aruri Ramesh: భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సభకు విస్తృత ప్రచారం కల్పించిన మీడియా ప్రతినిధులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై కేటీఆర్ చేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు అసహనంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందని...