Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Wardhannapet: జాతీయ పతాకానికి అవమానం (VIDEO)

Author
Posted By STAR TRINETHRAM
| 16 Aug 2026, 06:37 AM | Telangana
Wardhannapet: జాతీయ పతాకానికి అవమానం (VIDEO)


  • జాతీయ జెండా తలకిందులుగా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

  • జెండా ఆవిష్కరణలో కనిపించిన నిర్లక్ష్యం

  • కాషాయ రంగు కింది భాగంలో కనిపించిన వైనం

  • కనీస జాగ్రత్త తీసుకోలేదన్న విమర్శలు

  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన దృశ్యాలు


Wardhannapet: జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి జాతీయ పండుగను ఘనంగా నిర్వహిస్తే.. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపింది. శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు ఆరూరి రమేష్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయాల్సిన వేళ.. జెండాను తలకిందులుగా ఎగురవేయడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వర్ధన్నపేటలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

 











View this post on Instagram























 

A post shared by Ravi Ram teja BJYM (@raviramteja_bjym)


జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో కాషాయ రంగు పైభాగంలో, ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఉండేలా పతాకాన్ని సరిగ్గా అమర్చాల్సిన కనీస జాగ్రత్త కూడా తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో మరో అంశం కూడా తీవ్ర చర్చకు కారణమైంది. జెండా తలకిందులుగా ఉన్న విషయాన్ని వెంటనే గుర్తించాల్సిన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం ఆ సమయంలో గుర్తించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తలకిందులుగా ఉన్న జాతీయ జెండానే ఎగురవేసిన అనంతరం చప్పట్లు కొట్టడం, సెల్యూట్ చేయడం వంటి దృశ్యాలు కనిపించడంతో కార్యక్రమ నిర్వహణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ పతాకం విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అక్కడున్న వారు ఆ సమయంలో విషయాన్ని గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే జెండా ఆవిష్కరణ పూర్తయిన వెంటనే కొంతసేపటికి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తలకిందులుగా ఉన్న జాతీయ పతాకాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు జెండాను కిందకు దించి, సరైన విధంగా అమర్చి తిరిగి ఎగురవేశారు. పొరపాటును సరిచేసినప్పటికీ అప్పటికే జరిగిన ఘటన అక్కడ తీవ్ర చర్చకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం వంటి అత్యంత ప్రాధాన్యమైన జాతీయ పండుగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే జాతీయ జెండా విషయంలో ఇలాంటి తప్పిదం చోటుచేసుకోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ పతాకం పట్ల గౌరవం, దాని నిర్వహణకు సంబంధించిన అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని, ముఖ్యంగా ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

జాతీయ జెండాను తప్పుగా ఎగురవేయడం లేదా దానిని కించపరిచే విధంగా వ్యవహరించడం జాతీయ పతాక నిబంధనలు, జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం - 1971 పరిధిలో తీవ్రమైన అంశంగా పరిగణించబడుతుందని పలువురు గుర్తుచేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం దేశభక్తి భావాలను అవమానపరిచే చర్యగా కనిపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పతాకాన్ని అత్యంత పవిత్రంగా భావించే దేశంలో దాని ఆవిష్కరణ సమయంలోనే ఇంతటి నిర్లక్ష్యం ఎలా చోటుచేసుకుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు బాధ్యత, క్రమశిక్షణ, దేశభక్తి గురించి చెప్పాల్సిన నాయకులే ముందుగా జాతీయ చిహ్నాల పట్ల పూర్తి అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

జెండానే సరిగా ఎగురవేయలేని వారు పరిపాలన ఏం చేస్తారు?: స్థానికుల గుసగుసలు

జెండానే సరిగా ఎగురవేయలేని వారు పరిపాలన ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఇప్పుడు వర్ధన్నపేటలో వినిపిస్తున్నాయి. ఎంతో పవిత్రంగా, గౌరవంగా నిర్వహించాల్సిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనే ఇలాంటి అలసత్వం బయటపడితే.. ఇక ప్రజలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో ఎంత మేరకు బాధ్యత, పారదర్శకత, అప్రమత్తత ఉంటుందనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాటుగా తీసిపారేయకుండా జాతీయ పతాకానికి సంబంధించిన అంశాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యక్రమ నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు, కఠిన ఆదేశాలు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వర్ధన్నపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జెండా తలకిందులుగా ఎగురుతున్న సమయంలో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు స్పందించిన తీరు కూడా వీడియోలో కనిపిస్తుండటంతో ఈ ఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాన జాతీయ పతాకం విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా, సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ ఎటువైపు దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: