Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Eega Damodar: కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడిగా ఈగ దామోదర్

Author
Posted By STAR TRINETHRAM
| 03 Jul 2026, 05:08 PM | Telangana
Eega Damodar: కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడిగా ఈగ దామోదర్


  • ఈగ దామోదర్‌కు నాయకులు, కార్యకర్తల అభినందనలు

  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఈగ దామోదర్


Eega Damodar: వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈగ దామోదర్‌ను కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈగ దామోదర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

పట్టణంలోని ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తానన్నారు. పట్టణంలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఐక్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఈగ దామోదర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ALSO READ: Horror: ఓటీటీలో హారర్ సినిమా రచ్చ.. ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: