Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Warangal: సూర్య తండాలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

Author
Posted By STAR TRINETHRAM
| 21 Jun 2026, 09:43 AM | Telangana
Warangal: సూర్య తండాలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన


  • ఆలయ నిర్మాణానికి రూ.51,000 విరాళం అందించిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

  • ఉత్సవ కమిటీ సభ్యుల కృతజ్ఞతలు

  • విజయవంతంగా ముగిసిన ఉత్సవాలు


Warangal: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్య తండా గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, దుర్గమ్మ పండుగ, బొడ్రాయి పండుగ ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇలాంటి ధార్మిక ఉత్సవాలు నిర్వహించడం ద్వారా యువతకు సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు.

అనంతరం ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనుల కోసం రూ.51,000 విరాళాన్ని అందజేశారు. గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పరుపాటి శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధికి ఆయన అందించిన ఆర్థిక సహాయం నిర్మాణ పనులకు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు గుగులోత్ జాజు నాయక్, లేతకుల రంగా రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్, గాదె రవీందర్ రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, మునవత్ నారాయణ, చందు లక్ష్మన్, విజయ్, మునవత్ శంకర్, మునవత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య విజయవంతంగా ముగిసింది.

ALSO READ: Father’s Day: నాన్నకు ప్రేమగా ఇలా విష్ చేయండి..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: