Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Viral Video: అల్యూమినియం పాత్రలో ఇరుక్కున్న బాలుడు

Author
Posted By STAR TRINETHRAM
| 24 Apr 2026, 07:08 PM | Viral
Viral Video: అల్యూమినియం పాత్రలో ఇరుక్కున్న బాలుడు

Viral Video: ఇంట్లో ఆడుకుంటూ ఉండగా చిన్నారి చేసిన ఒక చిన్న తప్పిదం కుటుంబ సభ్యులను కంగారు పెట్టిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని మూకనాడు కల్చరల్ సెంటర్ సమీపంలో నివసిస్తున్న అంబయతింగల్ సాదిక్ అనే వ్యక్తి 4 ఏళ్ల కుమారుడు ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా అల్యూమినియం వంట పాత్రలో కూర్చొన్నాడు. మొదట సరదాగా చేసిన ఈ చర్య తర్వాత బాలుడు బయటకు రావడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఆ చిన్నారి ఆ పాత్రలోనే ఇరుక్కుపోయి భయంతో అల్లాడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. చివరకు పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

https://twitter.com/gharkekalesh/status/2047356876632035683?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2047356876632035683%7Ctwgr%5E050e35f4fdbeb50e9eb8b8c94ffa0b932d64c38c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fgharkekalesh%2Fstatus%2F2047356876632035683

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభించారు. చిన్నారి శరీరానికి ఎలాంటి గాయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అల్యూమినియం పాత్రను ఒక వైపు నుంచి నెమ్మదిగా కోయడం ప్రారంభించారు. ఆ సమయంలో బాలుడు భయపడకుండా ఉండేందుకు అక్కడ ఉన్న ఒక అధికారి అతనితో ముచ్చటిస్తూ ధైర్యం చెప్పడంతో పాటు నీళ్లు తాగిస్తూ అతన్ని శాంతింపజేశారు. దాదాపు 30 నిమిషాల పాటు జాగ్రత్తగా శ్రమించిన అనంతరం పాత్రను కోసి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. వీడియోను చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎక్కడ కూర్చోవడానికి స్థలం లేకపోయినట్టు ఆ పాత్రలో ఎందుకు కూర్చున్నావు అంటూ కొందరు సరదాగా వ్యాఖ్యానించగా, ఇంట్లో ఉన్న కుర్చీల కంటే అది సౌకర్యంగా అనిపించి ఉండొచ్చని మరికొందరు హాస్యంగా స్పందించారు. మరోవైపు చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా పలువురు సూచిస్తున్నారు. ఈ సంఘటన చిన్నారులపై పర్యవేక్షణ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది.

ALSO READ: Sachin Tendulkar: సచిన్‌కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: