Viral Video: అల్యూమినియం పాత్రలో ఇరుక్కున్న బాలుడు
Viral Video: ఇంట్లో ఆడుకుంటూ ఉండగా చిన్నారి చేసిన ఒక చిన్న తప్పిదం కుటుంబ సభ్యులను కంగారు పెట్టిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని మూకనాడు కల్చరల్ సెంటర్ సమీపంలో నివసిస్తున్న అంబయతింగల్ సాదిక్ అనే వ్యక్తి 4 ఏళ్ల కుమారుడు ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా అల్యూమినియం వంట పాత్రలో కూర్చొన్నాడు. మొదట సరదాగా చేసిన ఈ చర్య తర్వాత బాలుడు బయటకు రావడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఆ చిన్నారి ఆ పాత్రలోనే ఇరుక్కుపోయి భయంతో అల్లాడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. చివరకు పరిస్థితి...