Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Alimony Rules: భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?

Author
Posted By STAR TRINETHRAM
| 18 Jun 2026, 09:47 PM | National
Alimony Rules: భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?

Alimony Rules: దేశవ్యాప్తంగా విడాకుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భరణానికి సంబంధించిన అంశాలు తరచూ న్యాయస్థానాల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా విడాకుల అనంతరం భార్యకు భరణం చెల్లింపు విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అందులోనూ భర్త మరణించిన తర్వాత మాజీ భార్యకు భరణం అందుతుందా? కుటుంబ సభ్యులు లేదా వారసులు ఆ బాధ్యత వహించాలా? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఈ అంశంపై తాజాగా బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

వివాహ బంధం ముగిసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు భర్త మాజీ భార్యకు భరణం చెల్లించడం సాధారణంగా జరుగుతుంది. అయితే భర్త మరణించిన పరిస్థితిలో ఆ భరణం చెల్లింపులు నిలిచిపోతాయా లేదా కొనసాగుతాయా అనే అంశంపై స్పష్టత ఇస్తూ బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. భర్త మరణించినా కూడా అతడి ఆస్తిలో నుంచి మాజీ భార్యకు భరణం పొందే హక్కు కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. భర్త వారసత్వ ఆస్తుల నుంచి మాజీ భార్యకు భరణం చెల్లించాల్సిన బాధ్యత వారసులపై ఉంటుందని పేర్కొంది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నరేణ్ గోరెకావోంకర్ అనే వ్యక్తి 2012 మార్చిలో ఆకస్మికంగా మరణించాడు. ఆయన మరణం తర్వాత మాజీ భార్యకు అందుతున్న భరణం నిలిచిపోయింది. దీంతో భరణం కొనసాగించాలని కోరుతూ వర్ష అనే మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, భర్త మరణించినా అతడి ఆస్తుల నుంచి మాజీ భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ వారసులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ కేసులో మరో కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. కాలక్రమేణా భర్తకు చెందిన ఆస్తుల విలువ భారీగా పెరిగిందని, ప్రస్తుతం జీవన వ్యయం కూడా అధికమైందని పేర్కొంటూ భరణం మొత్తాన్ని పెంచాలని మాజీ భార్య కోర్టును కోరారు. కానీ ఈ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. భర్త మరణానంతరం ఆస్తుల విలువ పెరగడం లేదా వారసులు స్వయంగా సంపాదించిన ఆస్తులు పెరగడం ఆధారంగా భరణాన్ని పెంచలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మారాయని, ఖర్చులు పెరిగాయని మాత్రమే కారణంగా చూపి భరణం మొత్తాన్ని పెంచడం సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును విచారించిన జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజూషా దేశ్‌పాండే ధర్మాసనం, భరణం చెల్లించే బాధ్యత కొనసాగుతుందని స్పష్టం చేసినప్పటికీ, భరణం మొత్తాన్ని పెంచాలన్న డిమాండ్‌కు అనుమతి ఇవ్వలేదు.

ఈ తీర్పు ద్వారా విడాకులు పొందిన మహిళల హక్కులకు సంబంధించిన అంశంపై మరోసారి స్పష్టత లభించింది. భర్త మరణించినా భరణం హక్కు పూర్తిగా రద్దు కాదని, అయితే ఆస్తుల విలువ పెరిగిందనే కారణంతో భరణం మొత్తాన్ని పెంచాలని కోరలేమని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది.

ALSO READ: Andhra Pradesh: ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: