Alimony Rules: భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
Alimony Rules: దేశవ్యాప్తంగా విడాకుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భరణానికి సంబంధించిన అంశాలు తరచూ న్యాయస్థానాల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా విడాకుల అనంతరం భార్యకు భరణం చెల్లింపు విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అందులోనూ భర్త మరణించిన తర్వాత మాజీ భార్యకు భరణం అందుతుందా? కుటుంబ సభ్యులు లేదా వారసులు ఆ బాధ్యత వహించాలా? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఈ అంశంపై తాజాగా బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహ బంధం ముగిసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు భర్త మాజీ భార్యకు భరణం చెల్లించడం సాధారణంగా జరుగుతుంది. అయితే భర్త మరణించిన పరిస్థితిలో ఆ భరణం చెల్లింపులు నిలిచిపోతాయా లేదా...