Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Land Scam: బరితెగించిన కేటుగాళ్లు.. ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు..

Author
Posted By STAR TRINETHRAM
| 19 May 2026, 04:09 PM | Andhra Pradesh
Land Scam: బరితెగించిన కేటుగాళ్లు.. ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు..

Land Scam: చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే నకిలీగా తయారు చేసి ప్రభుత్వ రికార్డులను మార్చేందుకు ప్రయత్నించిన ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. గంగవరం మండల పరిధిలోని ఒక ప్రైవేటు భూమిని అమ్మేందుకు కేటుగాళ్లు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఉత్తర్వులు సృష్టించడం అధికార వర్గాలను అప్రమత్తం చేసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని బయటకు తీసి రిజిస్ట్రేషన్ చేయించేందుకు పక్కా ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

సమాచారం ప్రకారం గంగవరం ప్రాంతానికి చెందిన మంజునాథరెడ్డి పేరుపై జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నెంబర్ 244/1లో 1.11 సెంట్ల భూమి 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉంది. ఈ కారణంగా ఆ భూమిని అమ్ముకునే అవకాశం లేకపోవడంతో మంజునాథరెడ్డి ఇబ్బందులు పడుతున్నాడు. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకున్న దళారులు, నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించి అమ్మేలా చేస్తామని నమ్మించారు. ఇందుకోసం రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

అనంతరం కొందరు రెవెన్యూ అధికారుల పాత ప్రొసీడింగ్ కాపీలను సేకరించిన ముఠా, వాటిలో తేదీలు, సర్వే నెంబర్లు మార్చి కొత్త నకిలీ ఉత్తర్వులు తయారు చేసింది. కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి, భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించినట్లుగా చూపిస్తూ నకిలీ ప్రొసీడింగ్ ఆర్డర్ రూపొందించారు. ఆ తర్వాత ఆ నకిలీ పత్రాలతో పలమనేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించారు.

అయితే భూమి యజమాని సమర్పించిన ప్రొసీడింగ్ కాపీలో పూర్తి తేదీ లేకుండా కేవలం 2024 సంవత్సరం మాత్రమే ఉండటం సబ్ రిజిస్ట్రార్‌కు అనుమానం కలిగించింది. దీంతో వెంటనే ఆ పత్రాలను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించి పరిశీలించాలని కోరారు. అక్కడి అధికారులు కూడా అనుమానంతో కలెక్టర్ కార్యాలయానికి కాపీలు పంపించగా అసలు మోసం బయటపడింది. పరిశీలించిన కలెక్టరేట్ అధికారులు అవి పూర్తిగా నకిలీ ప్రొసీడింగ్ పత్రాలని నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు గంగవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫోర్జరీకి పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నకిలీ సంతకాలు, నకిలీ పత్రాల తయారీలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

జిల్లా కలెక్టర్ సంతకాన్నే నకిలీగా తయారు చేసి ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు చేయడానికి ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యవస్థను మోసం చేసి కోట్ల విలువైన భూములను అక్రమంగా విక్రయించేందుకు ముఠాలు ఎంత దారుణంగా ప్రయత్నిస్తున్నాయో ఈ ఘటన స్పష్టంగా చూపించిందని అధికారులు పేర్కొంటున్నారు.

ALSO READ: Astrology: కష్టపడినా గుర్తింపు రావట్లేదా?.. బుధ గ్రహ అనుగ్రహం కోసం ఇలా చేయండి..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: