Land Scam: బరితెగించిన కేటుగాళ్లు.. ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు..

Land Scam: చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే నకిలీగా తయారు చేసి ప్రభుత్వ రికార్డులను మార్చేందుకు ప్రయత్నించిన ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. గంగవరం మండల పరిధిలోని ఒక ప్రైవేటు భూమిని అమ్మేందుకు కేటుగాళ్లు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఉత్తర్వులు సృష్టించడం అధికార వర్గాలను అప్రమత్తం చేసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని బయటకు తీసి రిజిస్ట్రేషన్ చేయించేందుకు పక్కా ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం ప్రకారం గంగవరం ప్రాంతానికి చెందిన మంజునాథరెడ్డి పేరుపై జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నెంబర్ 244/1లో 1.11 సెంట్ల భూమి...