Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Aruri Ramesh: భవిష్యత్తు పూర్తిగా బీఆర్ఎస్‌దే

Author
Posted By STAR TRINETHRAM
| 17 May 2026, 08:56 PM | Telangana
Aruri Ramesh: భవిష్యత్తు పూర్తిగా బీఆర్ఎస్‌దే

Aruri Ramesh: పర్వతగిరి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చింత నెక్కొండ గ్రామంకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అరూరి రమేష్.. భవిష్యత్తు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు.

త్వరలో రాష్ట్రంలో చేపట్టబోయే SIR ప్రక్రియపై కార్యకర్తలతో ప్రత్యేకంగా చర్చించిన ఆయన.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈసారి సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబోతున్నామని తెలిపారు. ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుండగా, మరోవైపు పార్టీ కమిటీల నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అన్ని బూత్ స్థాయి కమిటీల నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని అరూరి రమేష్ వెల్లడించారు. పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని, గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్, చింత నెక్కొండ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ: Business: EV ఛార్జింగ్‌ స్టేషన్‌తో అధిక లాభాలు!.. ఎలా స్టార్ట్ చేయాలో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: