Aruri Ramesh: భవిష్యత్తు పూర్తిగా బీఆర్ఎస్దే
Aruri Ramesh: పర్వతగిరి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చింత నెక్కొండ గ్రామంకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అరూరి రమేష్.. భవిష్యత్తు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని...