Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్‌కు సేవా భూషణ్ స్వర్ణ నంది పురస్కారం

Author
Posted By STAR TRINETHRAM
| 13 Apr 2026, 10:12 PM | Telangana
డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్‌కు సేవా భూషణ్ స్వర్ణ నంది పురస్కారం

స్టార్ త్రినేత్రం, వేములవాడ: వేములవాడకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్ కు హైదరాబాద్ నగరంలోని త్యాగరాయ గాన సభ వేదికపై నిర్వహించిన ఘన కార్యక్రమంలో సేవా భూషణ్ స్వర్ణ నంది పురస్కారం ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. శిఖరం ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయనను గౌరవ అతిథిగా ఆహ్వానించగా, వేదికపై సన్మానం చేసి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న పలువురు ప్రముఖులు ఆయన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి గొల్ల కృష్ణ కీలక పాత్ర పోషించారు. గత 30 సంవత్సరాలుగా అనేక మంది ప్రతిభావంతులను వెలికితీస్తూ, వారిని వేదికపైకి తీసుకువచ్చి వివిధ అవార్డులను అందజేస్తూ కళా రంగానికి విశేష సేవలు అందిస్తున్నారని సభలో పాల్గొన్నవారు కొనియాడారు. ఆయన భవిష్యత్తులో కూడా మరింత మంది ప్రతిభావంతులను గుర్తించి సమాజానికి ఆదర్శంగా నిలపాలని వేదికపై ఉన్న ప్రముఖులు ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందించారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన లంక లక్ష్మీనారాయణ తన ప్రసంగంలో విస్తృతమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరి గురించి విశేషంగా వివరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తుల గురించి ఆయన చెప్పిన మాటలు సభలోని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుని చప్పట్లతో మార్మోగించాయి. త్యాగరాయ గాన సభ వేదిక కళాకారులకు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని, ఇలాంటి వేదికల ద్వారా అనేక మంది తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశాన్ని పొందుతున్నారని తెలిపారు. ఈ వేదికపై అవార్డులు అందజేస్తూ కళాకారులను ప్రోత్సహించడం కొనసాగాలని, అందరూ ఐరారోగ్యాలతో మరింత సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, అవార్డు గ్రహీతలు హాజరై సభను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్ మాట్లాడుతూ వేములవాడ నుంచి హైదరాబాద్ వరకు తనను ఆహ్వానించి గౌరవించినందుకు శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి గొల్ల కృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనేక వేదికల ద్వారా మరుగున పడిన కళలను వెలికితీస్తూ, మట్టిలో మాణిక్యాల్లాంటి ప్రతిభలను ప్రపంచానికి పరిచయం చేయడంలో గొల్ల కృష్ణ చేసిన కృషి అపారమని ప్రశంసించారు. ప్రతి రంగంలోనూ ప్రతిభావంతులను గుర్తించి అవార్డులు అందజేయడం ద్వారా వారిని ప్రోత్సహించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. త్యాగరాయ గాన సభ వేదికపై సేవా భూషణ్ స్వర్ణ నంది పురస్కారం అందుకోవడం తనకు గర్వకారణమని, ఈ అవకాశాన్ని కల్పించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కార్యక్రమంలో ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ ఏలేశ్వరం చలపతి శాస్త్రి కూడా పాల్గొని తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. నాట్య రంగం సహా వివిధ కళారంగాలపై తనకు ఉన్న విస్తృత అవగాహనను వ్యక్తం చేస్తూ, కవిత్వాన్ని వినిపించి సభలో ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించారు. అవార్డులు అందుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదని, నిజమైన ప్రతిభ ఉన్నవారికే ఈ గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. శిఖరం ఆర్ట్స్ థియేటర్ వంటి సంస్థలు కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ, కూచిపూడి, భరతనాట్యం వంటి సంప్రదాయ కళలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వేదికలపై కళాకారులను గౌరవించడం ద్వారా వారి ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, అవార్డు గ్రహీతలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ALSO READ: AP: వందే భారత్ రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: