డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్‌కు సేవా భూషణ్ స్వర్ణ నంది పురస్కారం

స్టార్ త్రినేత్రం, వేములవాడ: వేములవాడకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్ కు హైదరాబాద్ నగరంలోని త్యాగరాయ గాన సభ వేదికపై నిర్వహించిన ఘన కార్యక్రమంలో సేవా భూషణ్ స్వర్ణ నంది పురస్కారం ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. శిఖరం ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయనను గౌరవ అతిథిగా ఆహ్వానించగా, వేదికపై సన్మానం చేసి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న పలువురు ప్రముఖులు ఆయన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి గొల్ల కృష్ణ కీలక పాత్ర పోషించారు. గత 30 సంవత్సరాలుగా అనేక...