Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

IMD హెచ్చరిక.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

Author
Posted By STAR TRINETHRAM
| 21 Mar 2026, 09:12 PM | National
IMD హెచ్చరిక.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

IMD Warning: దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొన్ని రోజులపాటు తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా సబ్‌హిమాలయ ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో మార్చి 21 నుంచి 24 వరకు విస్తారంగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఒడిశాలో గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీచి వడగళ్ల వాన కురిసే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మార్చి 24న కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, మధ్య భారతంలోని బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా విడివిడిగా వర్షాలు కురవడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఉత్తర పశ్చిమ భారతదేశంలో కూడా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మార్చి 23న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో గాలులు గంటకు 40 కి.మీ. వేగంతో వీచే సూచనలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయని వాతావరణ నిపుణుడు అఖిల్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఢిల్లీలో వర్షపాతం కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. శనివారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉండగా, ఆదివారం నుంచి తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు హెచ్చరిక స్థాయి సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దక్షిణ రాష్ట్రాలు, మహారాష్ట్రలో కూడా విడివిడిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, తీరప్రాంతాల్లో వేడి, తేమ ఎక్కువగా ఉండే పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పిడుగుపాటు ప్రమాదం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ అధికారులు హెచ్చరించారు. అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు విద్యుత్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం మంచిదని అధికారులు సూచించారు.

ALSO READ: Bhadrachalam: రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: