IMD హెచ్చరిక.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

IMD Warning: దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొన్ని రోజులపాటు తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా సబ్‌హిమాలయ ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో మార్చి 21 నుంచి 24 వరకు విస్తారంగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే...