Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం

Author
Posted By STAR TRINETHRAM
| 19 Mar 2026, 05:17 PM | Telangana
CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం

CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వ హించిన ఉగాది పర్వదిన ప్రత్యేక పంచాంగ శ్రవణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతునామ సంవత్సరంగా అభివర్ణించారు. ఉగాది పండుగ వ్యవసాయానికి అనుబంధమైన గొప్ప పండుగగా గుర్తింపొందిందని, రైతుల శ్రమ ఫలితంగా దేశం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పంటలు పండించిన తర్వాత కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అన్ని పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ, అదనంగా బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలో వ్యవసాయం ప్రాధాన్యతను వివరిస్తూ, గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలోనే అతి తక్కువ రుణభారం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. రాష్ట్ర జనాభాలో సుమారు 70 శాతం మంది వ్యవసాయాధారిత కుటుంబాలేనని, ఐటి రంగం, పరిశ్రమలు ఎంతగా అభివృద్ధి చెందినా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలాధారం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20616 కోట్ల వ్యయంతో ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి వారిని రుణభారం నుంచి విముక్తులను చేశామని తెలిపారు. రైతులు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.12000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ, ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద దాదాపు రూ.18000 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రాబోయే 22వ తేదీ నుండి రైతు భరోసా కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడం, పంటలపై నమ్మకం పెంపొందించడం, ఉచిత విద్యుత్ సరఫరా వంటి చర్యల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి విధానం రైతులకు ఇబ్బందులు కలిగించిన సందర్భంలో, భూభారతి చట్టం ద్వారా భూములపై పూర్తి హక్కులను కల్పించామని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామా సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ALSO READ: Ugadi 2026: ఉగాది పండుగ విశిష్టత, పచ్చడి ప్రాముఖ్యత ఇదే..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: