Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Ayub Mohammed: దావత్-ఏ-ఇఫ్తార్‌లో పాల్గొన్న వరంగల్ డీసీసీ అధ్యక్షులు

Author
Posted By STAR TRINETHRAM
| 17 Mar 2026, 10:43 PM | Telangana
Ayub Mohammed: దావత్-ఏ-ఇఫ్తార్‌లో పాల్గొన్న వరంగల్ డీసీసీ అధ్యక్షులు

Ayub Mohammed: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హన్మకొండ 50వ డివిజన్ పరిధిలోని జులైవాడ మసీద్‌లో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో మంగళవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ మహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అయూబ్ మహమ్మద్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగం, సహనం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొని అన్ని మతాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర మాసం ద్వారా మనుషుల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ & కాజిపేట్ దర్గా పీఠాధిపతి సయ్యద్ షా గులాం ఆఫ్జల్ బియబాని (కుష్రో పాషా), తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, హన్మకొండ జిల్లా మైనారిటీ చైర్మన్ మీర్జా అజీజుల్లా భేగ్, స్థానిక కార్పొరేటర్ నెక్కొండ కవిత-కిషన్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ALSO READ: VC Sajjanar: అందం చూసి టెంప్ట్ అవ్వకండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: