Ayub Mohammed: దావత్-ఏ-ఇఫ్తార్‌లో పాల్గొన్న వరంగల్ డీసీసీ అధ్యక్షులు

Ayub Mohammed: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హన్మకొండ 50వ డివిజన్ పరిధిలోని జులైవాడ మసీద్‌లో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో మంగళవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ మహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయూబ్ మహమ్మద్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగం, సహనం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొని అన్ని మతాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర మాసం ద్వారా మనుషుల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆయన...