Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Hayathnagar: భార్యను కొట్టి చంపి హైడ్రామా.. చివరికి

Author
Posted By STAR TRINETHRAM
| 14 Mar 2026, 10:20 AM | Special Focus
Hayathnagar: భార్యను కొట్టి చంపి హైడ్రామా.. చివరికి

Hayathnagar: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో భర్త తన భార్యను సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు డ్రామా చేసినప్పటికీ, చివరికి పోలీసులచే అసలు నిజం వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. హయత్ నగర్‌లో నివాసమున్న దంపతుల మధ్య గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన గొడవలో ఆగ్రహానికి లోనైన భర్త, ఇంట్లోని సుత్తిని తీసుకుని భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయపడి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందింది.

అయితే, భయపడిన నిందితుడు అసలైన విషయాన్ని దాచిపెట్టి కుటుంబ సభ్యులు, పొరుగువారిని మోసంచేశాడు. అతను భార్య తలపై పెయింట్ బాక్స్ పడిందని చెప్పి, అసలు నిజాన్ని తప్పించాడు. వెంటనే ఆమెను యశోద ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

అయితే, అసలు నిజాన్ని మృతురాలి కూతుళ్లు బయటపడేలా చేశారు. తండ్రి చెబుతున్న “పెయింట్ బాక్స్” కథపై అనుమానం వ్యక్తం చేసిన కూతుళ్లు హయత్ నగర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని విచారించినపుడు, కుటుంబ కలహాల కారణంగా భర్త స్వయంగా సుత్తితో భార్యను హత్య చేశాడని అతను అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. కుటుంబాల మధ్య గొడవలు, క్షణిక ఆగ్రహం ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఈ దారుణ ఘటన స్పష్టంగా చెబుతోంది.

ALSO READ: Super Splendor: ఏం బండిరా బాబు.. ఒక్కసారి ఎక్కితే దిగాలనిపించదు.. మైలేజ్ కూడా లీటరుకు 70 కి.మీ.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: