Hayathnagar: భార్యను కొట్టి చంపి హైడ్రామా.. చివరికి

Hayathnagar: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో భర్త తన భార్యను సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు డ్రామా చేసినప్పటికీ, చివరికి పోలీసులచే అసలు నిజం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్ నగర్‌లో నివాసమున్న దంపతుల మధ్య గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన గొడవలో ఆగ్రహానికి లోనైన భర్త, ఇంట్లోని సుత్తిని తీసుకుని భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయపడి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందింది. అయితే, భయపడిన నిందితుడు అసలైన...