Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

RevanthReddy: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం కీలక హామీ

Author
Posted By STAR TRINETHRAM
| 07 Mar 2026, 07:44 PM | Telangana
RevanthReddy: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం కీలక హామీ

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

లొంగిపోయిన మావోయిస్టులకు రాజకీయాల్లోకి ఆహ్వానం

124 ఆయుధాలను పోలీసులకు అప్పగింత

చట్టపరంగా సాధ్యమైతే కేసుల ఎత్తివేత

తీవ్రత ఆధారంగా కేసుల పరిశీలన

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌తో కలిసి పనిచేయమని సూచన

స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న కేసులను చట్టపరంగా ఎత్తివేయడానికి ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు. తీవ్రత తక్కువగా ఉన్న కేసులను ఎత్తివేసే అవకాశముందని, అయితే తీవ్రమైన కేసులు ఉంటే వాటిని ప్రత్యేకంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తులు, వారి మీద ఉన్న నేరాల తీవ్రత ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే కూడా స్వాగతిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా ప్రతినిధులుగా ఎదిగిన ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క ఉదాహరణగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. లొంగిపోయిన వారిలో ఎవరికైనా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తి ఉంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి తమ అభిప్రాయం చెప్పవచ్చని సూచించారు. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ సభ్యులు కూడా అందులో ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మొత్తం 124 ఆయుధాలను సరెండర్ చేసినట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం చేపడుతున్న పునరావాస విధానంతో మావోయిస్టులు ప్రధానప్రవాహంలోకి రావడానికి ముందుకు వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

ALSO READ: Warangal: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: