RevanthReddy: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం కీలక హామీ

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు లొంగిపోయిన మావోయిస్టులకు రాజకీయాల్లోకి ఆహ్వానం 124 ఆయుధాలను పోలీసులకు అప్పగింత చట్టపరంగా సాధ్యమైతే కేసుల ఎత్తివేత తీవ్రత ఆధారంగా కేసుల పరిశీలన కాంగ్రెస్‌తో కలిసి పనిచేయమని సూచన స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న కేసులను చట్టపరంగా ఎత్తివేయడానికి ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు. తీవ్రత తక్కువగా ఉన్న కేసులను ఎత్తివేసే అవకాశముందని, అయితే తీవ్రమైన కేసులు ఉంటే వాటిని ప్రత్యేకంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తులు, వారి మీద ఉన్న నేరాల...